
షోస్

బ్లాక్‌బస్టర్ ‘ఎస్‌ఆర్ కళ్యాణమండపం’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శ్రీ ఐశ్వర్యలక్ష్మి మూవీస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 3గా ఈ కొత్త ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘కొత్త ప్రయాణం ప్రారంభమైంది’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
అయితే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, నటీనటులు, కథాంశం, ఇతర వివరాలను మేకర్స్ ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే మరిన్ని వివరాలు ప్రకటించనున్నట్లు తెలిపారు. ‘ఎస్‌ఆర్ కల్యాణమండపం’ దర్శకుడి నుంచి వస్తున్న ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఇప్పటి నుంచే క్యూరియాసిటీ పెరుగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!