

కరుప్పు (‘వీరభద్రుడు’ తెలుగు టైటిల్) చిత్రబృందం ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు బహిరంగ క్షమాపణలు తెలిపింది. సూర్య, త్రిష ప్రధాన పాత్రల్లో, ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అయితే సినిమాలోని ఓ సన్నివేశంలో కాపీరైట్ వివాదాలపై వచ్చే డైలాగులు పరోక్షంగా ఇళయరాజాను వ్యంగ్యంగా చూపించాయంటూ అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
వివాదం పెద్ద ఎత్తున చర్చకు దారితీయడంతో నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇళయరాజాపై తమకు అపార గౌరవం ఉందని, ఆయనను అవమానించే ఉద్దేశం ఏమాత్రం లేదని స్పష్టం చేసింది. ఆ డైలాగులు కేవలం హాస్య సందర్భంలో భాగమేనని పేర్కొంది. అయినప్పటికీ ఆయన మనోభావాలను గౌరవిస్తూ వివాదాస్పద సన్నివేశాన్ని, సంభాషణలను సినిమా తదుపరి ప్రదర్శనల నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!