
గాసిప్స్

తాను నటించిన జన నాయగన్ సినిమా చుట్టూ ఏర్పడిన వివాదంపై నటుడు, టీవీకే చీఫ్ విజయ్ స్పందించారు. ఓ వార్తా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తన రాజకీయ ప్రవేశం కారణంగా జన నాయగన్ నిర్మాతలు నష్టపోతున్నారనే ప్రచారంపై స్పందించారు. ఈ తరహా వివాదం తలెత్తుతుందని తాను ముందుగానే ఊహించానని విజయ్ వెల్లడించారు.
రాజకీయాల్లోకి రావడం తన వ్యక్తిగత నిర్ణయమని, దాని వల్ల సినిమా పరిశ్రమకు ఇబ్బందులు కలిగితే తనకు బాధగా ఉంటుందని అన్నారు. అయినప్పటికీ ప్రజల కోసం రాజకీయాల్లోకి అడుగుపెట్టడం తప్పనిసరి అనిపించిందని తెలిపారు. సినిమా, రాజకీయాలు రెండూ వేర్వేరు మార్గాలని, అయితే తన నిర్ణయాలపై వచ్చే ప్రభావాలను ముందుగానే అంచనా వేసుకున్నానని విజయ్ స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!