

హైదరాబాద్‌లో థియేటర్లకు ప్రేక్షకుల సంఖ్య తగ్గుతోందనే చర్చలు ఉన్నప్పటికీ, మరోవైపు కొత్త మల్టీప్లెక్సులు మాత్రం వేగంగా వెలుస్తూనే ఉన్నాయి. దేశంలో సినిమా అభిమానులు ఎక్కువగా ఉన్న నగరాల్లో హైదరాబాద్ ముందుండగా, నగరంలోని పలు ప్రాంతాల్లో కొత్త స్క్రీన్లు అందుబాటులోకి వస్తున్నాయి. గత ఏడాది వనస్థలిపురంలో ఏషియన్ మూవీస్–రవితేజ కలయికలో ప్రారంభమైన ఏఆర్టీ మల్టీప్లెక్స్‌కు మంచి స్పందన లభించగా, ఇప్పుడు కోకాపేటలో మరో ప్రతిష్టాత్మక మల్టీప్లెక్స్ ‘అల్లు సినిమాస్’ ప్రారంభమైంది. ఇది సంక్రాంతి నుంచే ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
ఈ మల్టీప్లెక్స్ ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో హైదరాబాద్‌కు తొలిసారి డాల్బీ స్క్రీన్ సిద్ధమైంది. అంతేకాదు, ఇది ఇండియాలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్‌గా గుర్తింపు పొందనుందని సమాచారం. ఇప్పటికే వనస్థలిపురంలోని ఏఆర్టీలోని ఎపిక్ స్క్రీన్ భారీ ఆదరణ పొందుతుండగా, ఇప్పుడు అల్లు సినిమాస్‌లోని ఈ డాల్బీ స్క్రీన్‌తో సినీ ప్రియులకు మరింత గ్రాండ్ థియేటర్ అనుభూతి లభించనుంది. టెక్నాలజీ, సౌండ్, విజువల్స్ పరంగా ఇది హైదరాబాద్ సినిమా ప్రేక్షకులకు కొత్త అధ్యాయంగా మారనుంది.


















.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!