

సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి తనయుడు ఘట్టమనేని జయకృష్ణ ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని హీరోయిన్‌గా నటించింది. భారీ అంచనాల మధ్య జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది.
విడుదలైన మొదటి రోజు నుంచే మిశ్రమ, ప్రతికూల స్పందన రావడం సినిమా వసూళ్లపై ప్రభావం చూపింది. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం, ఈ చిత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 1.25 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే సాధించింది. తిరుపతి నేపథ్యంలో రూపొందించిన ఈ ఇంటెన్స్ లవ్ స్టోరీలో కథలో బలహీనత, సెకండాఫ్ ఆకట్టుకోలేకపోవడం ప్రేక్షకులను నిరాశపరిచింది. జయకృష్ణ నటన, మాస్ యాక్షన్ సన్నివేశాలు మెప్పించినప్పటికీ, కథ బలహీనత కారణంగా సినిమా నిలదొక్కుకోలేకపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!