

యూట్యూబర్ నందన మంగళవారం సాయంత్రం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో పోలీసుల ఎదుట హాజరయ్యారు. పోలీసుల ఆదేశాల ప్రకారం ఆమె ఈ నెల 16లోగా స్టేషన్‌కు రావాల్సి ఉండగా.. గడువుకు ఒకరోజు ముందుగానే మంగళవారం హాజరై విచారణకు సహకరించారు.
విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురిని మోసం చేశారనే ఆరోపణలు నందన, ఆమె భర్తపై ఉన్నాయి. బాధితుల ఫిర్యాదుల మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత నందన దంపతులు అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఏపీ పోలీసులు లుక్‌అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో నందన సోమవారం బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో ఒంటరిగా విదేశాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. పాస్‌పోర్ట్, వీసా పత్రాలను తనిఖీ చేసిన ఇమిగ్రేషన్ అధికారులు ఎల్‌వోసీ ఆధారంగా ఆమెను అదుపులోకి తీసుకుని ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!