

సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా జోనస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఓ విదేశీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన మహేష్ బాబు.. రాజమౌళితో తన అనుబంధం, ఈ ప్రాజెక్ట్ ఎలా మొదలైందనే విషయాలను పంచుకున్నారు. మగధీర విడుదలైన తర్వాత సుమారు 15 ఏళ్ల క్రితమే రాజమౌళిని కలిశానని, ఆయనతో సినిమా చేయాలని అప్పుడే మాట్లాడినట్లు తెలిపారు.
రాజమౌళితో పనిచేయడం గురించి కూడా మహేష్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరు నటులు, స్నేహితులు రాజమౌళితో పని చేయడం చాలా కష్టమని తనను భయపెట్టారని, అయితే తనకు మాత్రం అలా అనిపించలేదన్నారు. రిహార్సల్స్, పక్కా ప్రణాళిక, ప్లానింగ్ కారణంగా షూటింగ్ ప్రక్రియ సులభంగా, సరదాగా సాగుతోందని చెప్పారు. రాజమౌళి వర్కింగ్ స్టైల్‌కు తాను అలవాటు పడిపోయానని, ఇకపై ఇతర దర్శకులతో పనిచేయడం కొంత కష్టంగా అనిపించవచ్చని సరదాగా వ్యాఖ్యానించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!