

దేశీయ ప్రాథమిక మార్కెట్‌లో ఐపీఓల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే పలు కంపెనీలు ఐపీఓలకు రాగా, ఈ వారంలో మరో 11 కంపెనీలు తమ ఇష్యూలతో మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఈ కంపెనీలు మొత్తం రూ.7,055 కోట్లు సమీకరించనున్నాయి. ఈ నెల 7 నుంచి 15వ తేదీ మధ్య ఐపీఓలు మార్కెట్లో ఉండనున్నాయి. చాలా ఇష్యూల సబ్‌స్క్రిప్షన్ మంగళ, బుధవారాల్లో ప్రారంభం కానుంది. రియల్ ఎస్టేట్, ఇంజనీరింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, పేమెంట్స్, ఐడెంటిటీ సొల్యూషన్స్, స్పెషాలిటీ కెమికల్స్, ఆన్‌లైన్ రెంటల్ రంగాలకు చెందిన కంపెనీలు ఇందులో ఉన్నాయి.
కొత్త ఐపీఓలతో ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చిన ఇష్యూల సంఖ్య 75కు చేరనుంది. ఈ నెల 7 నుంచి 10వ తేదీ మధ్య ప్రణవ్ కన్‌స్ట్రక్షన్స్, కనోహర్ ఎలక్ట్రికల్స్, ప్రసోల్ కెమికల్స్, గ్లాస్‌వాల్ సిస్టమ్స్ (ఇండియా), రెంటోమోజో, మణిపాల్ పేమెంట్, ఆర్సిల్, ఎల్‌సీసీ ప్రాజెక్ట్స్, కరమ్‌తారా ఇంజనీరింగ్, వీగాలాండ్ డెవలపర్స్ ఐపీఓలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టులో 23 ఐపీఓలు మార్కెట్లోకి వచ్చాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!