

హైదరాబాద్‌లో మెట్రో రైలు, ఆర్టీసీ బస్సు ప్రయాణానికి ఉమ్మడి పాస్‌ను వెంటనే ప్రవేశపెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని నెలవారీ, రోజువారీ పాస్‌లను జారీ చేయాలని సూచించారు. రసూల్‌పురాలోని మెట్రో రైల్ భవన్‌లో హెచ్‌ఎంఆర్‌ఎల్, ఆర్టీసీ, విద్యుత్ శాఖ, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఉమ్మడి పాస్ అమలుపై చర్చించారు. దీనికి సాంకేతికంగా సిద్ధంగా ఉన్నామని అధికారులు సీఎస్‌కు తెలిపారు.
అనంతరం సంజయ్ జాజు మెట్రో రైలు, ఇతర కీలక మౌలిక వసతుల ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. పాతబస్తీ మెట్రో కారిడార్ విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్లు, భూసేకరణ, రక్షణ శాఖ భూములు, బేగంపేట్ విమానాశ్రయం సమీపంలోని సొరంగ నిర్మాణానికి సంబంధించిన అనుమతులపై అధికారులతో చర్చించారు. అన్ని శాఖలు, సంస్థలు సమన్వయంతో పనిచేసి క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించి, కీలక ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!