

‘జి-జాంబి’, ‘ఓ సాతియా’ వంటి విభిన్న కథలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆర్యన్ గౌర ఇప్పుడు తన మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. లక్ష్మీ నరసింహ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై జ్యోతి కుమారి, తారకేశ్వర రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎప్పుడూ కొత్త కథాంశాలను ఎంచుకునే ఆర్యన్ గౌర ఈసారి కూడా భావోద్వేగభరితమైన కథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
తాజాగా విడుదలైన ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి స్పందనను అందుకుంటోంది. సూర్యాస్తమయం నేపథ్యంలో ఓ మహిళ వీల్‌చైర్‌లో కూర్చుని ఉండగా, ఒక వైపు హీరో, మరో వైపు పెంపుడు కుక్కపిల్ల కనిపించే దృశ్యం హృదయాన్ని తాకేలా ఉంది. “ఆమె స్ట్రెంత్.. అతడి ప్రామిస్.. వారి కథ” అనే ట్యాగ్‌లైన్ ఈ సినిమా ఒక భావోద్వేగపూరిత ప్రయాణాన్ని సూచిస్తోంది. నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో రావు రమేష్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!