

సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది స్మృతి మందన పెళ్లి వ్యవహారం. ఆమె పెళ్లి అకస్మాత్తు గా ఎందుకు నిలిచిపోయిందన్న ప్రశ్నే నెట్ లో పెద్ద చర్చగా మారింది. ఈ నేపథ్యంలో వరుడు పలాష్ ముచ్చల్ ఓ మహిళా కొరియోగ్రాఫర్ తో స్మృతికి ద్రోహం చేశాడనే రూమర్లు విస్తరించాయి.
ఈ వార్తలు పెరుగుతున్న నేపథ్యంలో లేడీ కొరియోగ్రాఫర్ గుల్నాజ్ ఖాన్ స్పష్టతనిచ్చింది. ఆమె సోషల్ మీడియాలో ఇలా చెప్పింది:
నా గురించి, నా ఫ్రెండ్ నందిని గురించి చాలా తప్పుడు వార్తలు, తప్పుదోవ పట్టించే ఊహాగానాలు వస్తున్నాయి. అందుకే ఈ విషయంలో నేరుగా క్లారిటీ ఇవ్వాలని అనుకున్నా. ఈ మొత్తం ఇష్యుతో మా ఇద్దరికీ ఎలాంటి సంబంధం లేదు. ఒక ఫొటో తీసుకున్నామన్న కారణంతో వారి వ్యక్తిగత జీవితానికి మమ్మల్ని ఎలా కలుపుతారు? వాస్తవం తెలియకుండా నిర్ణయాలకు రావద్దని కోరుతున్నా. విషయాన్ని అర్థం చేసుకుని మాకు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నా అని పేర్కొంది.
















.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!