

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం కింద అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నిధుల జమ ప్రక్రియ జులై 22 నుంచి ప్రారంభం కానుంది. ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పేద విద్యార్థుల తల్లులకు రూ.13,000 చొప్పున నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. జులై 22 నుంచి 24 మధ్య దశలవారీగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో సైబర్ మోసగాళ్ల నుంచి అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ‘తల్లికి వందనం’ పేరుతో వచ్చే నకిలీ లింకులు, యాప్లను నమ్మవద్దని, బ్యాంక్ ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, ఆధార్ నంబర్, ఓటీపీ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని సూచించారు. పథకం నిధుల జమకు సంబంధించిన సందేహాలు ఉంటే గ్రామ/వార్డు సచివాలయం లేదా పాఠశాల ప్రధానోపాధ్యాయులను మాత్రమే సంప్రదించాలని, దళారులు లేదా అనధికార వ్యక్తులను నమ్మవద్దని అధికారులు స్పష్టం చేశారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!