
జనరల్

నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి మెగాస్టార్ చిరంజీవి, సురేఖ గారిని వారి నివాసంలో కలిసి, ఆగస్టు 16న జరగనున్న తన కుమార్తె జనని వివాహ వేడుకకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారి ఆశీస్సులు అందుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు.
చిత్రసీమలోకి రావడానికి చిరంజీవి గారే తనకు స్పూర్తినిచ్చారని, ఆయన ఎంతోమందికి మార్గదర్శిగా నిలిచారని బండ్ల గణేష్ పేర్కొన్నారు. మెగాస్టార్ దంపతులను కలిసి వారి ఆశీస్సులు పొందడం జీవితంలో మధురమైన, ఆత్మీయమైన క్షణంగా భావిస్తున్నట్లు వెల్లడించారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!