
బిజినెస్

పరీక్షల ప్రశ్నాపత్రాలు పదేపదే లీక్ కావడం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే తీవ్రమైన సమస్య అని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. పోటీ పరీక్షల కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడి, భారీ మొత్తంలో ఖర్చు చేసి కోచింగ్ తీసుకున్న యువత ప్రశ్నాపత్రాలు లీక్ కావడంతో ఆగ్రహానికి గురికావడం సహజమేనని ఆమె వ్యాఖ్యానించారు.
ఈ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ సమంజసమని ప్రియాంక గాంధీ అభిప్రాయపడ్డారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుని విద్యార్థుల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!