
బిజినెస్

జాతీయ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ సమీపంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పార్లమెంట్‌ను ముట్టడించేందుకు సీజేపీ కార్యకర్తలు చేపట్టిన ప్రయత్నాన్ని ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. పార్లమెంట్ వైపు కదిలిన నిరసనకారులను బారికేడ్ల వద్ద నిలిపివేసి, భారీగా భద్రతా బలగాలను మోహరించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
సీజేపీ నేతలు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ నిరసన కొనసాగుతుందని ప్రకటించారు. ఇదే సమయంలో ఉద్యమ నాయకుడు వాంగ్‌చుక్ ఆస్పత్రిలోనే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నట్లు సమాచారం. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పార్లమెంట్ పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!