

ఐఐటీ మద్రాస్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం గేట్ 2027 పరీక్షలు ఫిబ్రవరి 6, 7, 13, 14, 20, 21 తేదీల్లో నిర్వహించనున్నారు. రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. నేషనల్ కోఆర్డినేషన్ బోర్డ్ ఆధ్వర్యంలో ఐఐటీలు, ఐఐఎస్‌సీ కలిసి ఈ పరీక్షను నిర్వహిస్తున్నాయి. 1983లో ప్రారంభమైన ఈ పరీక్షకు ఇది 45వ ఎడిషన్. ప్రతి సంవత్సరం సుమారు 10 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. 2026 ఆగస్టు మధ్యలో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుండగా, ఈసారి డిజిలాకర్, ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా గుర్తింపు ధృవీకరణను మరింత కఠినతరం చేశారు.
గేట్ 2027లో ఐదేళ్ల తర్వాత సిలబస్‌లో భారీ మార్పులు చేశారు. ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాధాన్యం దృష్ట్యా రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ (ఆర్‌ఏ) అనే కొత్త పేపర్ ప్రవేశపెట్టారు. టెక్స్‌టైల్ ఇంజినీరింగ్ అండ్ ఫైబర్ సైన్స్ పేపర్‌ను ఇంజినీరింగ్ సైన్సెస్ కింద కలిపారు. పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంలో మూడు గంటల పాటు జరుగుతుంది. మొత్తం 65 ప్రశ్నలు, 100 మార్కులు ఉంటాయి. అర్హత నిబంధనల్లో మార్పులు లేవు. తుది సంవత్సరం, మూడో సంవత్సరం విద్యార్థులు కూడా పరీక్షకు అర్హులు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!