

కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ దర్శకుడు మారుతి, ఇటీవల తెరకెక్కించిన ‘ది రాజాసాబ్’ సినిమాతో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలవడంతో విమర్శలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో మారుతి కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.
ఇప్పుడు మారుతి తన తదుపరి ప్రాజెక్ట్‌తో కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా పరిమిత బడ్జెట్లో వినోదాత్మక కథను తెరకెక్కించేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ విడుదల కోసం ఎదురు చూస్తుండగా, ఆ తరువాత నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ‘బరి’లో నటించనున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాక మారుతి-వరుణ్ తేజ్ కాంబినేషన్ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!