

‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు సాయిలు కాంపాటి మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం. 10గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ పుష్కూర్ రామ్మోహన్ రావు, శ్రీ భరత్ నారంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ గణేష్ ఆలయంలో పూజా కార్యక్రమాలతో సినిమా ఘనంగా ప్రారంభమైంది. సినీ ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ముల కెమెరా స్విచ్ ఆన్ చేయగా, హీరో అడివి శేష్ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు. సదానంద్ చిత్రబృందానికి స్క్రిప్ట్ అందించగా, తొలి షాట్‌ను దర్శకుడు సాయిలు కాంపాటి తెరకెక్కించారు.
‘మేమ్ ఫేమస్’తో గుర్తింపు పొందిన సుమంత్ ప్రభాస్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. చిన్న పట్టణం నేపథ్యంలో సాగే ప్రేమకథగా రూపొందనున్న ఈ సినిమాలో ఆయన ఉత్సాహంగా, వినోదాత్మకంగా ఉండే యువకుడి పాత్రలో కనిపించనున్నారు. కుటుంబ ప్రేక్షకులను అలరించే వినోదంతో పాటు ప్రేమ, భావోద్వేగాలకు కూడా కథలో ప్రాధాన్యం ఉండనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తుండగా, మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!