

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న మూవీపై రోజురోజుకీ హైప్ అమాంతం పెరిగిపోతోంది. ఇప్పటికే షూటింగ్ స్పాట్ నుంచి లీకైన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాకు భారీ బజ్ తెచ్చాయి. ప్రస్తుతం హీరోయిన్ రుక్మిణీ వసంత్‌తో తారక్ కీలక సీన్స్ చిత్రీకరణ జరుగుతుండగా, ఈ ప్రాజెక్ట్‌పై మరో హాట్ టాక్ ఫ్యాన్స్ మధ్య చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాను రెండు పార్ట్స్‌గా ఒకేసారి షూట్ చేస్తున్నారట. మొదటి భాగం విడుదలైన వెంటనే కేవలం 15 రోజుల గ్యాప్‌లోనే రెండో భాగాన్ని రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో మేకర్స్ ఉన్నారని సమాచారం. ప్రాజెక్ట్‌పై ఉన్న నమ్మకం చూస్తే, ఇండస్ట్రీ రికార్డులన్నీ ఈ సినిమాతో బద్దలవడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘వార్ 2’తో నిరాశలో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఈ వార్త డబుల్ జోష్ ఇచ్చింది. అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ట్రేడ్‌మార్క్ అయిన బ్లాక్ అండ్ వైట్ విజువల్ టోన్ ఈ సినిమాకు కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా ఉండనుందని టాక్.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!