

హీరోయిన్లు ఎప్పటికప్పుడు కొత్త ఫ్యాషన్ ట్రెండ్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటుంటారు. తాజాగా నటి జెనీలియా డిసౌజా కూడా తన విభిన్నమైన ఫ్యాషన్ ఎంపికతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పాత ఐదు పైసల నాణేలను పోలిన డిజైన్‌తో రూపొందించిన చెవి కమ్మలను ఆమె ధరించింది. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదెక్కడి కొత్త ఫ్యాషన్ అంటూ కొందరు కామెంట్లు చేస్తుండగా, మరికొందరు ఆమె స్టైల్‌ను ఆసక్తిగా గమనిస్తున్నారు.
అయితే జెనీలియా ధరించినవి నిజమైన ఐదు పైసల నాణేలు కాదని తెలుస్తోంది. ఆ నాణేలను పోలి ఉండేలా ప్రత్యేకంగా కస్టమైజ్ చేయించిన ఆభరణాలని సమాచారం. వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుందని ప్రచారం జరుగుతోంది. జెనీలియా కొత్త ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌తో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఆమెను చూసి మరికొందరు హీరోయిన్లు కూడా నాణేల తరహా డిజైన్‌తో చెవి కమ్మలు ధరిస్తారా? అనే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!