

టాలెంటెడ్ దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’ ఆగస్టు 7న విడుదలకు సిద్ధమవుతోంది. వరుణ్ తేజ్ హీరోగా, రితిక నాయక్ కథానాయికగా నటించిన ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్‌తో సినిమా చేయలేకపోయిన విషయాన్ని వివరించారు. ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ తర్వాత యువీ క్రియేషన్స్ బ్యానర్లో రామ్ చరణ్‌తో సినిమా చేసే అవకాశం వచ్చిందని, ఒక కథను కూడా వినిపించినట్లు తెలిపారు.
కానీ ఆ కథపై తనకు పూర్తి నమ్మకం కలగకపోవడంతో ముందుకు వెళ్లలేదని మేర్లపాక గాంధీ వెల్లడించారు. అదే విషయాన్ని రామ్ చరణ్ మరియు నిర్మాతలకు చెప్పగా, వారు కూడా పూర్తి నమ్మకం వచ్చినప్పుడు చేయాలని సానుకూలంగా స్పందించారని అన్నారు. అనంతరం ‘కృష్ణార్జున యుద్ధం’ కథను హీరో నానికి వినిపించగా, ఆయనకు నచ్చిందని తెలిపారు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదని ఆయన పేర్కొన్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!