

హీరోలకు మాత్రమే అభిమాన సంఘాలు, ప్రత్యేకమైన క్రేజ్ ఉండే రోజులు మారుతున్నాయి. ప్రస్తుతం కొంతమంది దర్శకులు కూడా తమకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్‌ను సంపాదించుకుంటున్నారు. దర్శకులకు ఫ్యాన్ కల్చర్‌ను తీసుకొచ్చిన వారిలో దాసరి నారాయణరావు ముందుండగా, ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్ వంటి దర్శకుల వద్ద ఈ ట్రెండ్ మరింత బలపడింది. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా ఈ క్రేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు.
‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి సినిమాలతో సందీప్ రెడ్డి వంగా పేరు ఒక ప్రత్యేక బ్రాండ్‌గా మారింది. ఆయన సినిమాలపైనే కాకుండా, ఆయన మాటలు, అభిప్రాయాలు, విమర్శలకు ఇచ్చే సమాధానాలపైనా అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ప్రభాస్‌తో ‘స్పిరిట్’ తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ క్రేజ్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వంగా పేరు ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారీ చర్చ మొదలవుతోంది. దీంతో హీరోల మాదిరిగానే దర్శకులకు కూడా ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్ ఏర్పడుతున్న ట్రెండ్‌కు సందీప్ రెడ్డి వంగా తాజా ఉదాహరణగా నిలుస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!