
సినిమాలు

దర్శకుడు భాగ్యరాజ్ అంత్యక్రియల సందర్భంగా నెలకొన్న పరిస్థితులపై నటి రాధిక శరత్‌కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియమైన వ్యక్తికి చివరి వీడ్కోలు చెప్పే వేళ ప్రశాంత వాతావరణం ఉండాల్సిందిపోయి, భారీ రద్దీ కారణంగా గందరగోళం నెలకొనడం బాధాకరమని ఆమె అన్నారు. దుఃఖించాల్సిన ప్రదేశం సర్కస్‌లా మారిందని వ్యాఖ్యానిస్తూ, కుటుంబ సభ్యుల భావోద్వేగాలను గౌరవించాలని కోరారు.
ఇలాంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం, సినీ పరిశ్రమ కలిసి అంత్యక్రియల సమయంలో జనసమూహం, మాధ్యమాల నిర్వహణకు స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని రాధిక సూచించారు. భాగ్యరాజ్‌తో తనకు 50 సంవత్సరాల స్నేహం ఉందని గుర్తుచేసుకుంటూ, ఆయన గొప్ప కళాకారుడు, ప్రతిభావంతమైన రచయిత అని కొనియాడారు. ఆయన మరణం కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు తీరని లోటని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!