

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2 మూడో ఎపిసోడ్‌లో టాప్ 15లో చోటు కోసం పలువురు కంటెస్టెంట్లు తమ ప్రతిభను, వ్యక్తిత్వాన్ని జడ్జీల ముందు ప్రదర్శించారు. అయితే రాజకుమారి ఈ ఎపిసోడ్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. చిన్న వయసులోనే ఎదురైన వివాహ సమస్యలు, కుటుంబ పరిస్థితులు, పిల్లల కోసం పడిన కష్టాలను ఆమె వివరించింది. టైలరింగ్ చేస్తూ పిల్లలను పోషించుకుంటూనే నటనపై తనకున్న ఆసక్తిని కొనసాగించినట్లు తెలిపింది. తన జీవితంలో ఎదురైన ప్రమాదం, దాని తర్వాత మళ్లీ ధైర్యంగా నిలబడిన తీరును చెప్పడంతో ఆమె కథ అందరినీ కదిలించింది.
రాజకుమారి కథ విన్న నవదీప్ కన్నీరు పెట్టుకోగా, బిందు మాధవి, అభిజిత్ ఆమె ధైర్యం, నిజాయితీని ప్రశంసించారు. ముగ్గురు గ్రీన్ కార్డులు ఇవ్వడంతో ఆమె నేరుగా టాప్ 15లోకి బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. మరోవైపు శ్రష్టి వ్యాకరణం, అయ్యప్ప సాధు, అపర్ణ, రామకృష్ణ, లయ, వెంకీ వైబ్ తదితరులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కొందరిని హోల్డ్‌లో ఉంచగా, మరికొందరిని జడ్జీలు తిరస్కరించారు. మిగిలిన టాప్ 15 స్థానాల కోసం పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!