

‘బేబి’ సినిమాతో విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న కొత్త సినిమా ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నుంచి తొలి పాట విడుదలైంది. ‘90స్’ ఫేమ్ దర్శకుడు ఆదిత్య హాసన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నటుడు శివాజీ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో సోమవారం చిత్రంలోని తొలి గీతాన్ని విడుదల చేశారు. “సంచారమే ఎంతో బాగున్నదీ.. దీనంత ఆనందం ఏమున్నదీ” అంటూ సాగిన ఈ పాటకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు. గోరేటి వెంకన్న సాహిత్యం రాయడంతో పాటు హేషమ్తో కలిసి స్వయంగా ఆలపించారు. ఈ పాటలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లండన్ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!