

తమిళ స్టార్ హీరో సూర్య తన భవిష్యత్ ప్రాజెక్టులతో మరోసారి సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్న ఆయన నటిస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుండగా, ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇదే సమయంలో ఆయన తదుపరి చిత్రాలకు సంబంధించి ఆసక్తికర వార్తలు వెలుగులోకి వస్తున్నాయి.
‘జై భీమ్’తో ప్రశంసలు అందుకున్న టీజే జ్ఞానవేల్‌తో పాటు ‘24’ చిత్ర దర్శకుడు విక్రమ్ కుమార్‌తో కూడా సూర్య మరోసారి కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జీతూ మాధవన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సూర్య, ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యాక కొత్త చిత్రాలపై దృష్టి సారించనున్నారని సమాచారం. ముఖ్యంగా విక్రమ్ కుమార్‌తో తెరకెక్కే సినిమా ఆయన కెరీర్‌లో 50వ చిత్రంగా నిలిచే అవకాశం ఉందన్న వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!