

దుషారా విజయన్ ప్రస్తుతం మకుటం, జీడీఎన్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సినిమా పరిశ్రమలో టాలెంట్, గ్లామర్, పారితోషికం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోడలింగ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించినట్లు చెప్పిన దుషారా, ఆ రంగంలో రూపానికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని, కానీ సినిమా రంగంలో నటనకు, ప్రతిభకు గుర్తింపు లభిస్తుందని అన్నారు. కొందరు స్టార్ హీరోలు ప్రత్యేక లుక్ ఉన్న గ్లామరస్ హీరోయిన్లతో పనిచేయడానికి ఆసక్తి చూపినా, దర్శకులు తనను నటనను చూసే సంప్రదిస్తున్నారని తెలిపారు.
పారితోషికం కోసం తాను సినిమాలు చేయడం లేదని దుషారా స్పష్టం చేశారు. మంచి కుటుంబ నేపథ్యం ఉన్నందున సినిమాలు చేయకపోయినా తన కుటుంబం తనకు అండగా ఉంటుందని చెప్పారు. తనకు డబ్బు కంటే నటనపై ఉన్న ఆసక్తే ముఖ్యమని, పారితోషికం అనేది అదనపు బోనస్ మాత్రమేనని పేర్కొన్నారు. ప్రస్తుతం అందుతున్న పారితోషికంతో పూర్తిగా సంతృప్తిగా ఉన్నానని, మంచి పాత్రలు, నటిగా గుర్తింపు పొందడంపైనే తన దృష్టి కేంద్రీకృతమై ఉందని దుషారా విజయన్ వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!