
సినిమాలు

సీనియర్ నటి పావలా శ్యామల అంత్యక్రియలు రేపు హైదరాబాద్‌లోని వనస్థలిపురం స్మశానవాటికలో నిర్వహించనున్నారు. ఆమెకు ఘనంగా చివరి వీడ్కోలు పలికేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) స్వీకరించినట్లు నటి కరాటే కళ్యాణి వెల్లడించారు. సినీ రంగానికి ఆమె అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
సామాజిక కార్యకర్త శంకర్ నిర్వహిస్తున్న రెడీ టూ సర్వ్ ఫౌండేషన్‌కు ఆమె పార్థివ దేహాన్ని తరలించారు. అభిమానులు, సినీ ప్రముఖులు, సన్నిహితులు చివరి నివాళులు అర్పించేందుకు అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అంత్యక్రియలకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!