

మోటారు వాహన ప్రమాద పరిహారం క్లెయిమ్‌లలో వయస్సు నిర్ధారణకు ఆధార్ కార్డును మాత్రమే ఆధారంగా తీసుకోలేమని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆధార్ కార్డు వ్యక్తి గుర్తింపు, నివాస ధృవీకరణ కోసం జారీ చేసే పత్రం మాత్రమేనని, పుట్టిన తేదీకి ఖచ్చితమైన చట్టబద్ధమైన ఆధారంగా పరిగణించలేమని కోర్టు పేర్కొంది.
వయస్సు నిర్ధారణ కోసం మున్సిపల్ అధికారులు జారీ చేసే జనన ధృవీకరణ పత్రాలు, పాఠశాల మెట్రిక్యులేషన్ రికార్డులు వంటి అధికారిక పత్రాలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. మోటారు ప్రమాద పరిహారానికి సంబంధించిన కేసు విచారణలో ఈ వ్యాఖ్యలు చేసింది.
అలాగే బీమా సంస్థల బాధ్యతలపై కూడా హైకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. కేవలం ప్రీమియం చెల్లించినంత మాత్రాన బీమా సంస్థపై పూర్తి బాధ్యత పడదని, పాలసీలో పేర్కొన్న తేదీ, సమయం నుంచి మాత్రమే బీమా ఒప్పందం అమల్లోకి వస్తుందని తేల్చి చెప్పింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!