

బాలీవుడ్లో ‘డాన్ 3’ సినిమా వివాదం మరింత ముదురుతూ కోర్టు దశకు చేరుకుంది. నటుడు రణ్వీర్ సింగ్‌పై నిషేధం విధించిన ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (ఎఫ్‌డబ్ల్యూఐసీఈ)కు ఆయన లీగల్ నోటీసులు పంపారు. నోటీసుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నప్పటికీ, ఎఫ్‌డబ్ల్యూఐసీఈ చీఫ్ అడ్వైజర్, ఫిల్మ్‌మేకర్ అశోక్ పండిట్ నోటీసులు అందినట్లు ధృవీకరించారు. ఈ నేపథ్యంలో ముంబయిలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. దీంతో సంస్థ ఎలాంటి స్పందన ఇస్తుందో అన్న ఆసక్తి నెలకొంది.
ఈ వివాదం ఫర్హాన్ అక్తర్ తెరకెక్కించాలనుకున్న ‘డాన్ 3’ సినిమా నుంచి రణ్వీర్ మధ్యలో వైదొలగడంతో ప్రారంభమైంది. నిర్మాతలకు రూ.45 కోట్ల ప్రీ ప్రొడక్షన్ నష్టం కలిగిందని ఆరోపణల నేపథ్యంలో, ఆ వివాదం పరిష్కారం అయ్యే వరకు ఆయనతో పని చేయవద్దని ఎఫ్‌డబ్ల్యూఐసీఈ సూచించింది. దీనిపై రణ్వీర్ టీమ్ స్పందిస్తూ, ఆయనకు సినిమా పరిశ్రమపై గౌరవం ఉందని, సినిమా విజయాన్ని దృష్టిలో ఉంచుకుని మౌనంగా ఉన్నారని తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యవహారం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!