

సందీప్ రెడ్డి వంగా సినిమాల నిర్మాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను ఆయన సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా వెల్లడించారు. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఆయన, ఓ ప్రాజెక్టు కోసం బాలీవుడ్ నటి దీపికా పదుకొనేతో చర్చలు జరిగిన విషయాన్ని గుర్తుచేశారు. తొలుత సందీప్ రెడ్డి వంగా ఆమెనే కథానాయికగా భావించారని, దాదాపు ఏడాదిన్నర పాటు కథపై చర్చలు సాగాయని తెలిపారు.
అయితే ఆ సమయంలో దీపికకు వరుసగా భారీ విజయాలు రావడంతో పారితోషికం, షూటింగ్ తేదీలు, కాల్‌షీట్ విషయంలో మార్పులు చోటుచేసుకున్నాయని ప్రణయ్ రెడ్డి వంగా చెప్పారు. సినిమా నెట్ ఇన్‌కమ్‌లో 10 శాతం వాటా కోరినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని కీలక విషయాలు బయటకు లీక్ చేసినట్లు ఆరోపించారు. ఈ పరిణామాలతో ప్రాజెక్టు ప్రణాళికలు దెబ్బతింటాయని భావించిన సందీప్ రెడ్డి వంగా ఆమెను ప్రాజెక్టు నుంచి తప్పించినట్లు ప్రణయ్ తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!