
సినిమాలు

ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌ను కలిశారు. తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి, సోమల రఘురామ్ రెడ్డి వివాహ వేడుకకు కుటుంబ సమేతంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ, తన భర్త అనిల్ కుమార్‌తో కలిసి సీఎం విజయ్‌కు వివాహ ఆహ్వాన పత్రికను అందించారు.
ఈ సందర్భంగా సీఎం విజయ్‌తో భేటీ కావడం ఆనందంగా ఉందని షర్మిల పేర్కొన్నారు. తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా వ్యక్తిగతంగా ఆహ్వానించినట్లు తెలిపారు. సీఎం విజయ్ ఆత్మీయంగా పలకరించి, నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!