

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ జానపద గాయని గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా రూపొందిన ‘గరివిడి లక్ష్మి’ సినిమా ట్రైలర్‌ను ప్రత్యేక కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ వేడుకకు హీరో అడివి శేష్‌తో పాటు దర్శకులు బాబీ కొల్లి, హరీష్ శంకర్, మారుతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన కళా ప్రదర్శనలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, పాటలు వింటుంటే తన బాల్యం గుర్తుకొచ్చిందని అడివి శేష్ తెలిపారు. సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది నటించగా, గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వం వహించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా తనకు దేవుడు ఇచ్చిన వరమని ఆనంది పేర్కొన్నారు. ‘గరివిడి లక్ష్మి’ తమకు ఎంతో ప్రత్యేకమైన చిత్రమని కృతీ ప్రసాద్ అన్నారు. టైటిల్ పాత్రకు ఆనంది సరైన ఎంపిక అని విశ్వప్రసాద్ తెలిపారు. ప్రేక్షకులను పాటలతో పాడిస్తూ, ఆటలతో అలరిస్తూ, నవ్విస్తూ, భావోద్వేగానికి గురిచేసేలా సినిమా ఉంటుందని దర్శకుడు గౌరీ నాయుడు చెప్పారు. రాగ్ మయూర్, సంగీత దర్శకుడు చరణ్ అర్జున్, నటుడు వీకే నరేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రం అక్టోబర్ 17న విడుదల కానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!