
సినిమాలు

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు పెండింగ్ డీఏల్లో రెండు డీఏలను విడుదల చేసేందుకు ఇటీవల అంగీకరించిన ప్రభుత్వం, తాజాగా వాటికి సంబంధించిన జీవోలను జారీ చేసింది. దీంతో డీఏ బకాయిల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఊరట లభించనుంది.
2024 జనవరి, 2024 జూలై డీఏలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ రెండు డీఏలకు సంబంధించిన బకాయిలను విడతలవారీగా చెల్లించనున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఆర్థికంగా కొంత ఉపశమనం లభించనుంది. మిగిలిన పెండింగ్ డీఏలపై ప్రభుత్వం భవిష్యత్‌లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!