
సినిమాలు

ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం చారిత్రాత్మక మైలురాయి అని, గుర్తుండిపోయే సందర్భమని జగన్ పేర్కొన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రయాణం దేశ ప్రధానమంత్రిగా కొనసాగుతోందని తెలిపారు.
గత 25 ఏళ్లుగా ప్రజాసేవలో కొనసాగుతున్న ప్రధాని నరేంద్ర మోదీని ఈ సందర్భంగా అభినందిస్తున్నట్లు వైఎస్ జగన్ పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ మోదీకి అన్ని విధాలా మంచి జరగాలని, ప్రజాసేవలో మరింత విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!