
సినిమాలు

వరంగల్ జిల్లాలో బుధవారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. నెక్కొండ మండలం పిట్టకాలుబోడు తండాలో ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు ఢీకొని మూడేళ్ల చిన్నారి మృతి చెందాడు. గ్రామానికి చెందిన రమేశ్, అఖిల దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా.. చిన్న కుమారుడు రాహుల్ (3) ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇంటి ఎదురుగా ఉన్న రోడ్డుపై పడిన ఆటవస్తువును తీసుకునేందుకు చిన్నారి వెళ్లాడు.
అదే సమయంలో నెక్కొండ మండల కేంద్రానికి చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు చిన్నారిని ఢీకొట్టినట్లు సమాచారం. బస్సు ముందు, వెనుక టైర్లు చిన్నారిపై నుంచి వెళ్లడంతో రాహుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!