

శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ చిత్రం ఈ శుక్రవారం థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. మహిమా నంబియార్ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి జనకీరామ్ మారెల్లా దర్శకత్వం వహించారు. 1992లో ఆంధ్రా–ఒడిశా సరిహద్దు నేపథ్యంలో కథ సాగుతుంది. తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ ప్రేమ, కామెడీ, యాక్షన్ అంశాలతో ఫన్ రైడ్‌ను అందించబోతున్నామనే సంకేతాలను ఇచ్చింది.
ఒక నక్సలైట్ పోలీసుల నుంచి తప్పించుకుని ఆంధ్రా–ఒడిశా సరిహద్దు సమీపంలోని ఓ చిన్న పట్టణంలో కుటుంబంతో రహస్యంగా జీవిస్తుంటాడు. అక్కడ ఓ ఒడియా అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే భాషా సమస్య వారి మధ్య ఆసక్తికరమైన పరిస్థితులకు దారితీస్తుంది. ట్రైలర్ ద్వితీయార్థంలో కథానాయకుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టినట్లు కనిపిస్తోంది. ఆ గాలింపు సన్నివేశాల్లోనూ కామెడీకి పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. శ్రీ విష్ణు తనదైన శైలిలో కనిపించగా, రాధిక, సుదర్శన్, షైన్ టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. కోన వెంకట్ సమర్పణలో స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!