

బాలీవుడ్ నటి దియా మీర్జా తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. తన సహనటుడు నవాజుద్దీన్ సిద్దిఖీని ట్యాగ్ చేస్తూ ఆమె చేసిన ఘాటు వ్యాఖ్యలు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశాయి. అతనితో కలిసి పనిచేయడం ఓ పీడకలలా అనిపించిందని, మాట్లాడే తీరు, యాటిట్యూడ్ అసహనాన్ని కలిగిస్తాయని ఆమె పేర్కొన్నట్లు సమాచారం. అంతేకాకుండా అతడిని చిరాకు తెప్పించే క్యారెక్టర్‌గా అభివర్ణించారు. సాధారణంగా ఎంతో ప్రశాంతంగా, హుందాగా కనిపించే దియా ఇలా బహిరంగంగా వ్యాఖ్యలు చేయడంతో వీరిద్దరి మధ్య ఏదైనా విభేదాలు తలెత్తాయా అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు.
అయితే, ఈ పోస్ట్ వెనుక మరో ఉద్దేశం ఉండవచ్చని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా దియా తన పోస్ట్‌లో ఉపయోగించిన ‘క్యారెక్టర్’ అనే పదాన్ని ప్రస్తావిస్తూ, ఇది కొత్త ప్రాజెక్ట్ ప్రమోషన్‌లో భాగమై ఉండొచ్చని కామెంట్లు చేస్తున్నారు. దియా మీర్జా, నవాజుద్దీన్ సిద్దిఖీ కలిసి ‘డాక్టర్ హసన్’ అనే కొత్త ఓటీటీ మెడికల్ డ్రామా సిరీస్‌లో నటిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. దీంతో ఈ పోస్ట్ నిజమైన గొడవకు సంబంధించినదా లేక సిరీస్ ప్రచారం కోసం చేసిన వినూత్న ప్రయత్నమా అనే ఆసక్తి నెలకొంది. దీనిపై నటీనటుల నుంచి అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!