

డిసెంబర్ నెలలో బాక్సాఫీస్ దగ్గర ఆసక్తికరమైన పోటీ నెలకొనబోతోంది. ముఖ్యంగా డిసెంబర్ 4న పలు చిత్రాలు ఒకేరోజు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అక్కినేని నాగచైతన్య నటిస్తున్న వృషకర్మ, రష్మిక మందన్న ప్రధాన పాత్రలో తెరకెక్కిన మైసా, విశ్వక్ సేన్ నటించిన లెగసీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటితో పాటు బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ నటిస్తున్న హిందీ చిత్రం ఈతా కూడా అదే రోజు విడుదల కానుంది. ఈ ఏడాదిని మంచి విజయంతో ముగించాలని చిత్ర బృందాలు ఆశిస్తున్నాయి.
ఈ చిత్రాల పోటీలో ప్రమోషన్ల విషయంలో నాగచైతన్య ఇప్పటికే ముందడుగు వేశాడు. వృషకర్మ కోసం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాడు. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ మిస్టిక్ థ్రిల్లర్లో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. సినిమా మీద చిత్ర బృందం పూర్తి నమ్మకంతో ఉండటంతో విడుదలకు ముందే ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీంతో డిసెంబర్ విడుదలల పోటీలో ప్రమోషన్ల పరంగా నాగచైతన్య ప్రస్తుతం ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!