

దర్శకుడు రాజమౌళి మరియు మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న వారణాసి చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కుతున్నది. ఈ సినిమా టైటిల్ను ప్రత్యేకమైన ఈవెంట్ ద్వారా ప్రకటించారు. ప్రీ-రిలీజ్ వేడుకను తలపించేలా ఆ కార్యక్రమాన్ని అత్యంత గ్రాండ్గా నిర్వహించారు.
అయితే ఈ కార్యక్రమంలో రాజమౌళి ఆంజనేయ స్వామిని ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలు హిందు సంఘాల ఆగ్రహాన్ని రేకెత్తించాయి. రాజమౌళిపై చర్యలు తీసుకోవాలని కొందరు పోలీసులకు ఫిర్యాదులు కూడా చేసారు. హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యల కోసం వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీ నాయకుడు చికోటీ ప్రవీణ్ కూడా స్పందించారు. రాజమౌళి ప్రవర్తనను విమర్శిస్తూ, మదం ఎక్కిన ఏనుగు మురికి కాలువలో పడినట్లున్నది అని వ్యాఖ్యానించారు. దేవుళ్ల పేరుతో సినిమాలు తీసి డబ్బులు సంపాదిస్తూ, అదే దేవుణ్ని అవమానించేలా మాట్లాడటం సరైందికాదని విమర్శించారు. దేవుణ్ని నమ్మని వ్యక్తి సినిమా ప్రారంభానికి ముందు పూజ ఎందుకు చేస్తారని కూడా ప్రశ్నించారు.
ఇలాగే అహంకారంతో వ్యవహరిస్తే రాజమౌళి పతనం తప్పదని హెచ్చరించారు. ఆంజనేయ స్వామిపై చేసిన వ్యాఖ్యల వల్ల వివాదం వేగంగా ముదురుతున్న నేపథ్యంలో, దీనిపై రాజమౌళి ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!