

టాలీవుడ్‌లో ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు థియేటర్ వ్యాపారంలోకి ప్రవేశించి విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా అడుగుపెట్టనున్నట్లు ఫిల్మ్ నగర్‌లో ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్, ఏషియన్ సినిమాస్‌తో కలిసి ‘ఏఆర్‌సీ సినిమాస్’ పేరుతో కొత్త థియేటర్‌ను ప్రారంభించే ప్రణాళికలో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే ప్రాథమిక ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ గచ్చిబౌలి ప్రాంతంలో ప్రీమియం మల్టీప్లెక్స్‌ను ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఇప్పటికే ఏఎంబీ, ఏఏఏ, ఏఆర్టీ, అల్లు సినిమాస్ వంటి మల్టీప్లెక్స్‌లు విజయవంతంగా నడుస్తున్న నేపథ్యంలో, ఈ ఇద్దరు స్టార్ హీరోలు కూడా రంగంలోకి దిగితే పోటీ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!