

నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భక్తిరస ప్రధాన చిత్రం ‘మూకుత్తి అమ్మన్ 2’ థియేట్రికల్ రిలీజ్ డేట్ ఖరారైంది. సుందర్ సి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2026 నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం టీజర్‌ను విడుదల చేయడంతో పాటు అధికారిక రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. ఇందులో రెజీనా కసాండ్రా, దునియా విజయ్, యోగిబాబు, ఊర్వశి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. సినిమా పోస్ట్ థియేట్రికల్ బిజినెస్ కూడా పూర్తయింది. థియేట్రికల్ రన్ అనంతరం ‘మూకుత్తి అమ్మన్ 2’ను జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జియోహాట్‌స్టార్ దక్కించుకోగా.. శాటిలైట్ హక్కులను స్టార్ మా సొంతం చేసుకుంది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, అవ్ని సినిమాక్స్, రౌడీ పిక్చర్స్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హిప్‌హాప్ తమిళా ఆది సంగీతం అందిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!