

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్‌కు అభిమానుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ తర్వాత ఈ జోడీ మరోసారి కలిసి నటిస్తున్న సినిమా ‘రణబాలి’. అయితే ఈసారి లవ్‌స్టోరీ కాకుండా బ్రిటిష్ పాలన నేపథ్యంలో సాగే భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఇద్దరూ కనిపించనున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక ‘జయమ్మ’ అనే కీలక పాత్రలో నటిస్తోంది.
తాజాగా రష్మిక తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తిగా ముగించింది. ఈ సందర్భంగా చిత్రబృందం ఆమెకు సెట్స్‌లో ప్రత్యేకంగా వీడ్కోలు పలికింది. విజయ్‌తో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, రష్మికకు విజయ్ ఇచ్చిన స్పెషల్ హగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. సినిమాలో జయమ్మ పాత్ర కొన్ని సన్నివేశాల్లో గర్భిణిగా కనిపించనుందనే ప్రచారం ఉన్నప్పటికీ, మేకర్స్ మాత్రం పూర్తి వివరాలను వెల్లడించలేదు. ఇప్పటికే విడుదలైన టీజర్‌లో విజయ్ రగ్గడ్ వారియర్‌గా కనిపించగా, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్రలో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా తొలుత సెప్టెంబర్ 11న విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు 2026 అక్టోబర్ 16న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!