

దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న మహేష్‌బాబు, ప్రియాంక చోప్రా జోనస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వారణాసి’ చిత్రానికి సంబంధించినదిగా చెబుతున్న ఓ సెట్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారీ పురాతన ఆలయ నిర్మాణాలు, ప్రాచీన జీవులు, డైనోసార్ కనిపిస్తున్న ఈ ఫొటో చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. నిర్మాణం స్థాయి హాలీవుడ్ చిత్రాలను తలపిస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ ఫొటో నిజమైనదా లేదా కృత్రిమ మేధస్సుతో రూపొందించిందా అనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదు.
మరోవైపు ‘వారణాసి’ కోసం భారీ స్థాయిలో నిర్మాణ పనులు జరుగుతున్నట్లు ఇప్పటికే పలు కథనాలు వెలువడ్డాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో సుమారు రూ.50 కోట్ల వ్యయంతో పవిత్ర నగరం వారణాసిని పోలిన భారీ సెట్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా సాగే యాక్షన్, కాల ప్రయాణం వంటి అంశాలకు అనుగుణంగా ఈ భారీ నిర్మాణాలు ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. చిత్రబృందం అధికారికంగా స్పందించే వరకు వైరల్ అవుతున్న ఫొటో నిజమైనదా కాదా అనేది స్పష్టమయ్యే అవకాశం లేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!