

తెలుగు యూత్ రొమాంటిక్ డ్రామా ‘హుషార్ పిట్టలు’ టీజర్ విడుదలైనప్పటి నుంచే వివాదానికి కేంద్రంగా మారింది. టీజర్‌లోని బోల్డ్ రొమాంటిక్ సన్నివేశాలు, డబుల్ మీనింగ్ డైలాగ్స్, టీనేజ్ పాత్రల మధ్య చూపించిన సన్నిహిత సన్నివేశాలపై సోషల్ మీడియాలో పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సినిమా విడుదలకు ముందే దీనిపై ఆసక్తి, చర్చ రెండూ పెరిగాయి. అన్ష్ థోరట్, వాసవి గణేశన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆగస్టు 15, 2026న థియేటర్లలో విడుదలై పరిమిత బడ్జెట్‌తో హిట్‌గా నిలిచింది.
బిక్షు దర్శకత్వం వహించిన ఈ సినిమా టీనేజ్ ప్రేమ, కామెడీతో పాటు పీర్ ప్రెజర్, స్మార్ట్‌ఫోన్ల వినియోగం, ఆన్‌లైన్ కంటెంట్ ప్రభావం వంటి అంశాలను ప్రస్తావిస్తుంది. రుద్ర క్రాంతి పిక్చర్స్ బ్యానర్‌పై కె. వెంకట్ యాదవ్ నిర్మించగా.. ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాను పంపిణీ చేసింది. సునీత మనోహర్, అంజి వల్గుమన్, గోవర్ధన్ రెడ్డి (గోవర్ధన్ బీకే), రమేశ్ నకిరేకంటి తదితరులు సహాయ పాత్రల్లో కనిపించారు. థియేటర్లలో మంచి స్పందన అందుకున్న ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. దీంతో థియేటర్లలో చర్చకు దారితీసిన దాని బోల్డ్ ట్రీట్‌మెంట్ ఓటీటీ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!