
రాజకీయాలు

మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యంపై అసత్య ప్రచారం చేస్తూ వీడియోలు వైరల్ చేసిన ఒక యూట్యూబ్ ఛానెల్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం, చిరంజీవి ప్రతిష్ఠకు భంగం కలిగించేలా తప్పుడు సమాచారం, మార్ఫింగ్ వీడియోలు, ఫోటోలను ఆ ఛానెల్ విస్తృతంగా ప్రచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై హైదరాబాద్ కమలాపురి కాలనీకి చెందిన న్యాయవాది రామకృష్ణ మిర్యాల జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ తప్పుడు కంటెంట్‌కు సంబంధించిన వీడియో లింకులు, స్క్రీన్ షాట్లను ఆధారాలుగా సమర్పించారు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా ఆరోగ్యంపై ఇలాంటి అసత్య వార్తలు వ్యాప్తి చేయడం చట్టవిరుద్ధమని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం కోర్టు అనుమతితో కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!