

యంగ్ సెన్సేషన్ తిరు వీర్ తన తాజా చిత్రం ప్రీ వెడ్డింగ్ షో విజయాన్ని ఆస్వాదిస్తున్న వేళ, తన కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రారంభించాడు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రంలో హీరోయిన్గా ప్రతిభావంతమైన నటి ఐశ్వర్య రాజేశ్ నటించనుంది. ఆమె ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న భరత్ దర్శన్‌కి ఇది డెబ్యూ ప్రాజెక్ట్ కాగా, గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా గ్రాండ్ లాంచ్ ఈవెంట్ నేడు హైదరాబాద్‌లో జరిగింది. కార్యక్రమానికి చిత్ర బృందం మరియు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
పూర్తిగా ఎంటర్టైన్మెంట్తో నిండిన ఈ చిత్రం ప్రేక్షకులకు పూర్ణ వినోదాన్ని అందించబోతోందని టాక్. ఈ నెల 19 వ తేదీ నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. సాంకేతిక బృందంలో ఛాయాగ్రహకుడిగా సి.హెచ్. కుషేందర్, సంగీత దర్శకుడిగా భరత్ మంచిరాజు పని చేస్తున్నారు. ఈ సినిమాను దక్షిణ భారతంలోని అన్ని ప్రధాన భాషల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!