

2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, 2026 కి ఘనంగా స్వాగతం చెప్పేందుకు దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో న్యూ ఇయర్ ఈవెంట్లు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో ప్రముఖ నటి సన్నీలియోన్ పాల్గొనే మెగా ఈవెంట్ కూడా ఉత్తరప్రదేశ్‌లోని మధురలో జరగాల్సి ఉంది. అయితే, ఈ కార్యక్రమానికి అనుకోని అడ్డంకి ఎదురైంది.
శ్రీకృష్ణుడు జన్మించిన పవిత్ర నగరమైన మధురలో ఇలాంటి వినోద కార్యక్రమం నిర్వహించడం పై స్థానిక సాదువులు, ఆధ్యాత్మిక సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. జనవరి 1వ తేదీన ఓ ప్రైవేట్ హోటల్లో డీజే నైట్‌తో పాటు సన్నీ లియోన్ పాల్గొనే ఈవెంట్‌కు నిర్వాహకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేయగా, టికెట్లు కూడా విక్రయమయ్యాయి.
అయితే, మధుర వంటి ధార్మిక ప్రాధాన్యత ఉన్న ప్రాంతంలో భజనలు, కీర్తనలు, ప్రవచనాలు జరగాల్సిన చోట ఇలాంటి కార్యక్రమాలు సరికావని హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈవెంట్ ద్వారా అశ్లీలత ప్రోత్సహించబడుతుందంటూ, శ్రీకృష్ణ జన్మభూమి సంఘర్ష్ న్యాస్ సహా పలు ధార్మిక సంస్థలు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాయి.
ఈ నేపథ్యంలో, ఈవెంట్‌ను రద్దు చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు రావడంతో, హోటల్ యాజమాన్యం వెనక్కి తగ్గింది. స్థానికుల భావోద్వేగాలను గౌరవిస్తూ న్యూ ఇయర్ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో మధురలో జరగాల్సిన ఈ మెగా ఈవెంట్ పూర్తిగా నిలిచిపోయింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!