

హిందీ చిత్రపరిశ్రమలో విభిన్న పాత్రలతో గుర్తింపు పొందిన భూమి పెడ్నేకర్, పాన్ ఇండియా చిత్రం ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్లో కీలక పాత్రలో నటించనున్నారు. సందీప్ సింగ్ దర్శకత్వంలో, రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మహారాజు శివాజీ జీవిత గాథను ప్రతిబింబించనుంది. ఈ విషయాన్ని దర్శకుడు సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ ఏడాది ప్రారంభంలో ‘దల్దాల్’ సిరీస్‌లో పోలీసు అధికారిణిగా భూమి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ చిత్రంలో భూమి కర్ణాటకకు చెందిన ధైర్యవంతమైన యోధురాలు బెలవాడీ మల్లమ్మ పాత్రలో కనిపించనుంది. శివాజీ సైన్యంతో వీరోచితంగా పోరాడిన ఈ పాత్ర తనకు చాలా ప్రత్యేకమని ఆమె పేర్కొన్నారు. గత చిత్రాలకంటే ఇది భిన్నమైన సవాలుతో కూడిన పాత్ర అని తెలిపారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉండగా, ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం కానుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!