

తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బండ్ల గణేష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఒకప్పుడు నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన, తర్వాత నిర్మాతగా మారి అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌తో చేసిన సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి.
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్‌తో మరో సినిమా చేయాలనే కోరిక ఉందని బండ్ల గణేష్ వెల్లడించారు. తెలుగు ప్రేక్షకులంతా ఉలిక్కిపడేలా ఆ సినిమాను తెరకెక్కిస్తానని తెలిపారు. అలాగే ఆ చిత్రంతో తన పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్‌ను ముగించాలని భావిస్తున్నట్లు చెప్పారు. పవన్ కళ్యాణ్ తనకు దేవుడితో సమానమని పేర్కొన్న ఆయన, మాట ఇచ్చినట్లే ఆ సినిమాను పూర్తి చేస్తానని స్పష్టం చేశారు. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్‌పై ఇప్పటికే ఆంజనేయులు, గబ్బర్ సింగ్, ఇద్దరమ్మాయిలతో, నీ జతగా నేనుండాలి, గోవిందుడు అందరివాడేలే, టెంపర్ వంటి చిత్రాలు విడుదలయ్యాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!